బాలాపూర్ గణేష్ లడ్డూ@ రూ.35 లక్షలు

TG: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. కాగా లడ్డూ వేలం పాటలో 38 మంది పాల్గొన్నారు. బాలాపూర్ ల‌డ్డూకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వేలం 1994లో కేవలం రూ.450తో మొదలైంది. ప్రతి సంవత్సరం పెరుగుతూ రికార్డులను సృష్టిస్తోంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలు పలికింది. కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్