స్వర్ణగిరి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేష్.. రూ.2 కోట్లతో సెట్ (వీడియో)

TG: బాలాపూర్ గణేష్‌ని ఈసారి భక్తుల్ని ఆకట్టుకునేలా ప్రత్యేకంగా అలంకరించారు. స్వర్ణగిరి ఆలయ నమూనాలో రూపుదిద్దుకున్న గణేష్ సెట్‌కు నిర్వాహకులు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడేలా సెట్‌ వేయడంతో భక్తులకు స్వర్ణగిరి దేవాలయ వైభవం గుర్తుకువస్తోంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు స్వర్ణగిరి గణేష్ దర్శనానికి తరలి వస్తున్నారు. కాగా, ప్రతి ఏటా బాలాపూర్ గణేష్‌ను విశేషంగా అలంకరించడం ఆనవాయితీ.

సంబంధిత పోస్ట్