ఆసియాకప్ సూపర్-4 తొలి మ్యాచులో శ్రీలంకపై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 168/7 రన్స్ చేసింది. శనక 64 పరుగులతో రాణించారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు సైఫ్ (61), హృదయ్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. చివరి ఓవరులో 5 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతికి నాలుగు పరుగులు రాగా, శనక 2 వికెట్లు తీయడంతో ఉత్కంఠ నెలకొంది. ఐదో బంతికి అహ్మద్ సింగిల్ తీసి బంగ్లాకు విజయాన్ని అందించారు.