గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో బతుకమ్మ (వీడియో)

TG: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు గిన్నిస్ రికార్డులో నమోదయ్యాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ముందు 1354 మంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఆడిపాడారు. ఇది అతిపెద్ద జానపద నృత్యంగా పేర్కొంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి చేరుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్