బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ జీతం ఎంతో తెలుసా?

భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ బ్యాటర్ మిథున్ మన్హాస్‌ బీసీసీఐ కొత్త చీఫ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా బీసీసీఐ చీఫ్‌గా గౌరవం పొందిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయనకు జీతం ఉండదు. అయితే, అధికారిక విధులకు రోజువారీ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చుల కింద ఏడాదికి రూ. 5 కోట్ల వరకు వస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక బోర్డు సమావేశాలకు రూ. 40వేలు, దేశీయ ప్రయాణానికి రూ. 30వేలు, అంతర్జాతీయ ప్రయాణానికి రోజుకు రూ. 84వేలు అందుకుంటారు.

సంబంధిత పోస్ట్