ఈ నెల 5వ తేదీన చందమామ మరింత పెద్దగా, కాంతిమంతంగా కనిపించనుంది. ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని, దీనిని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, డిసెంబర్‌లో కూడా ఒక కోల్డ్ మూన్ కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.