ఝార్ఖండ్‌లో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందగా అతడు మళ్లీ బతుకుతాడనే మూఢనమ్మకంతో మృతదేహాన్ని పేడ దిబ్బలో ఉంచారు. లాతేహార్ జిల్లాలోని రామ్‌పుర్ గ్రామానికి చెందిన రామ్‌నాథ్ యాదవ్ (45) పశువుల మేతకు వెళ్లి పిడుగుపడటంతో మరణించాడు. అయితే, బంధువులు రామ్‌నాథ్ తిరిగి బతుకుతాడనే మూఢనమ్మకంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవు పేడ దిబ్బలో ఉంచారు. కాగా, పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.