మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే, క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో బాగా పాపులర్ అయింది. బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసిన తర్వాత, తెలుగులో విజయ్ దేవరకొండతో 'కింగ్ డమ్' సినిమా ద్వారా మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, ప్రస్తుతం ఆమె నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తోంది. రామ్ పోతినేనితో 'ఆంధ్ర కింగ్', దుల్కర్ సల్మాన్‌తో 'కాంతా', సూర్యతో ఒక సినిమా, అలాగే ప్రభాస్ సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకుంది.