మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా ఉన్న జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. మూలధనం లోపం, నిబంధనల ఉల్లంఘనలే కారణమని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు డిపాజిటర్లకు మొత్తం చెల్లించే స్థితిలో లేదని పేర్కొంది. అక్టోబర్ 7 నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిలిపేశారు. లిక్విడేటర్‌ను నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.