మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా పుట్టిన వెంటనే పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల వరకు బరువు ఉంటారు. 3 - 3.5 కిలోలను సగటు బరువుగా చెబుతుంటారు. కానీ జబల్‌పూర్‌లో 5.2 కిలోల బరువున్న శిశువు జన్మించాడు.