ఉప ఎన్నికలో BRSను గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: భట్టి

TG: అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని బీజేపీ వాళ్లు లేఖ రాశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'అజారుద్దీన్‌ దేశం ఔన్నత్యం పెంచిన వ్యక్తి. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా లేఖ రాయడం దురదృష్టకరం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి BRS సహకరించడంతోనే 8 సీట్లు గెలుచుకుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని BJP ప్రయత్నిస్తోంది. అందుకే అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని బీజేపీ అంటోంది' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్