జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి, రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో 24 కమిటీల సభ్యులు పాల్గొన్నారు.