ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో స్థానిక బీజేపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది పితాబస్ పాండాను ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. ఒడిశా స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న పాండాపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.