బీజేపీ ఎంపీపై రాళ్లతో దాడి (వీడియో)

పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఆయన అనుచరులపై టీఎంసీ నేతలు దాడి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జల్పైగురిలో కొండచరియలు విరిగిపడ్డారు. సహాయక చర్యల్లో భాగంగా ఆయన నాగరకతకు వెళ్తుండగా టీఎంసీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఖాగెన్ ముర్ము తలకు గాయమవ్వగా.. రక్తం ఏరులై పారింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్