ఢిల్లీలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు మృతదేహాలు మారిపోయాయి. పంకజ్ కుమార్, భరత్ భూషణ్‌ల బాడీలను పొరపాటున మార్చురీలో కలిపి పెట్టడంతో భూషణ్ కుటుంబం పంకజ్ మృతదేహానికి అంత్యక్రియలు చేసింది. తరువాత ఈ తప్పిదం వెలుగులోకి రావడంతో పంకజ్ కుటుంబం ఆస్పత్రిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.