TG: వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రేమజంట ఘటనలో యువతి మృతదేహం లభ్యమైంది. జనగాం జిల్లా శంకర్ తండా సమీపంలోని కుంటలో శ్రావ్య మృతదేహం దొరికింది. వరదలో ఇద్దరు గల్లంతు కాగా చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రావ్య ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె స్వగ్రామం దమన్నపేటలో విషాదం నెలకొంది.