AP: సీఎం చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన దాడి ఘటనకు నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 2003, అక్టోబర్ 1న, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి సీఎం తిరుమలకు వస్తుండగా ఈ దాడి జరిగింది. సాయంత్రం 4.12 గంటలకు, ఘాట్రోడ్ మలుపులో మావోలు క్లేమోర్ మైన్లను పేల్చారు. ఆ ధాటికి బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్న చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యానించారు.