పాక్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ (VIDEO)

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బలోచ్ వేర్పాటువాదులు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్‌గా చేసుకొని మంగళవారం ట్రాక్‌పై బాంబులు పేల్చారు. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పి ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తు పారామిలటరీ బలగాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. బలోచ్ గ్రూప్ బలోచ్ రిపబ్లిక్ గార్డ్స్ తమ పనేనని ఒప్పుకుంది. రైల్లోని సైనికులు కూడా ఈ పేలుడులో ప్రభావితమయ్యారని సమాచారం.

సంబంధిత పోస్ట్