ఢిల్లీ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు

ఢిల్లీ సెక్రటేరియట్‌, మౌలానా ఆజాద్ మెడికల్‌ కాలేజ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మెయిల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2:45కు MAMCలో, 3:30కు సీఎం కార్యాలయంలో పేలుడు జరగనున్నట్లు హెచ్చరించారు. వెంటనే పోలీసులు స్పందించి బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ రెండు చోట్లా తనిఖీలు చేపట్టారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో ఇది గత నకిలీ మెయిల్‌కు పోలికలతో ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్