అమెరికా పెన్సిల్వేనియాలోని హెర్షీ పార్క్‌లో మోనోరైల్ పట్టాలపై ఒక బాలుడు ప్రమాదకరంగా నడుస్తూ కనిపించగా, అక్కడున్న జాన్ శాంసన్ అనే వ్యక్తి అతన్ని రక్షించారు. టైంకి స్పందించి శాంసన్ చేసిన ధైర్యసాహసాన్ని పార్క్ అధికారులు, సందర్శకులు ప్రశంసించారు. బాలుడు ఎలా ఆ పరిమిత ప్రదేశంలోకి ప్రవేశించాడన్న విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.