రామచిలుకను పట్టుకునేందుకు ప్రయత్నించి.. బాలుడు మృతి

కేరళలోని కొచ్చి అలువాలో విషాదం చోటుచేసుకుంది. రామచిలుకను పట్టుకోవాలని చెట్టును ఊపగా, అది కూలి మీద పడి 12 ఏళ్ల ముహమ్మద్‌ సినాన్‌ మృతి చెందాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో సినాన్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరకముందే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినాన్‌ తోట్టక్కుటుకరాలోని పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడని చెప్పారు.

సంబంధిత పోస్ట్