కాబూల్ నుండి ఢిల్లీకి వచ్చిన KAM ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు దాక్కున్నాడు. విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాక, అక్కడ బాలుడిని విమాన సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో, బాలుడు ఉత్సుకతతోనే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కినట్లు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు అదే విమానంలో అతన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి పంపించారు.