మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర అనే యువకుడిని లవ్ చేసిన యువతి ఇటీవల బ్రేకప్ చెప్పింది. దీంతో మళ్లీ తనను ప్రేమించాలని రాజేంద్ర వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను స్కూటీతో ఢీకొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.