AP: అరగంట వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. ఏటవాకిలి గ్రామానికి చెందిన పురుషోత్తం శెట్టి (75), రాధాకృష్ణయ్య శెట్టి (67) కలిసి ఉంటూ నిత్యావసర వస్తువుల దుకాణం నడుపుతున్నారు. సోమవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లిన తమ్ముడు కాలుజారి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన అన్న తన తమ్ముడిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో బాత్రూం తలుపు గడియ తలకు బలంగా తగడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.