TG: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)కి ఫిర్యాదు చేసింది. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ 'వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తా' అని అన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఈసీ చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.