తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాలైన తిరుపతి,  విశాఖపట్నంలో ఇంజినీరింగ్ కళాశాలలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్