దారుణం.. నడిరోడ్డుపై మహిళను కత్తితో పొడిచిన వ్యక్తి(వీడియో)

AP: విజయవాడ భవానీపురంలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీదేవి అనే మహిళపై అప్పారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. కానీ ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న సదరు మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ చికిత్స పొందుతుండగా.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్