ఏపీలో మహిళ దారుణ హత్య.. 20 నెలల తర్వాత వెలుగులోకి!

AP: చిత్తూరు (D), పెనుమూరు (M), సామిరెడ్డిపల్లెలో 20 నెలల తర్వాత ఓ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బంగారుపాళెంకు చెందిన చెంచులక్ష్మి (28) భర్తతో విడిపోయి దేవేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. 2023 డిసెంబరులో వారి మధ్య గొడవ జరగడంతో, దేవేంద్ర ఆమెను మామిడి తోటలోని నీటి గుంతలో ముంచి చంపి, అక్కడే పాతిపెట్టాడు. పోలీసులు కేసును ఛేదించి, దేవేంద్రను తాజాగా అరెస్ట్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పాతిపెట్టిన చోట తవ్వి ఎముకలను వెలికితీశారు.

సంబంధిత పోస్ట్