కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. మాల (40) అనే మహిళ గుడికి వెళ్తుండగా, దుండగులు ఆమెను రాయితో తలపై బలంగా కొట్టి చంపారు. మాల తన కుటుంబంతో భూ వివాదం నడుస్తోంది. ఇటీవల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఆస్తి వివాదమే హత్యకు కారణం అయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కోలార్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.