హైదరాబాద్ మియాపూర్‌లోని రఫా పునరావాస కేంద్రంలో బుధవారం రాత్రి సందీప్ (39) అనే రోగి హత్యకు గురయ్యాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ డ్రగ్స్‌కు బానిసై ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతున్నాడు. అదే కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న నల్గొండకు చెందిన ఆదిల్, బార్సాస్‌కు చెందిన సులేమాన్ కలిసి దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.