TG: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసింది. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త కేకలు విని స్థానికులు అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలను అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు.