బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. రెచ్చిపోయిన సీఐ (వీడియో)

AP: చిత్తూరులోని సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిన్న బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి రుద్ర 3వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో రుద్ర కుటుంబ సభ్యులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్తుండగా.. ఓ మహిళను సీఐ నిత్యబాబు తోసేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, గత  నెల 31న ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సంబంధిత పోస్ట్