కుప్పకూలిన భవనం.. 13 మంది సజీవ సమాధి! (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహర్ మార్గ్‌లో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 14 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్