ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఆయన చిత్రాలతో వెలిగింది. "హ్యాపీ బర్త్‌డే" సందేశంతో పాటు భారత జెండా రంగులు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది మోదీకి గ్లోబల్ స్థాయిలో లభించిన అరుదైన గౌరవంగా నెటిజన్లు చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ శుభాకాంక్షలు తెలపగా, మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.