TG: మూసీ వరద ఉధృతి తగ్గడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ తేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను తొలగించారు. దీంతో MGBS నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కాాగా నిన్న బస్టాండ్‌లోకి వరద నీరు చేరడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.