ఎద్దు దాడిలో వ్యాపారి మృతి (వీడియో)

రాజస్థాన్‌లోని బలోత్రాలో ఆదివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ప్రఖ్యాత స్వీట్స్ వ్యాపారి మోతీలాల్ అగర్వాల్ (55) ఒక ఎద్దు దాడిలో మృతి చెందారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను వెనకనుంచి వచ్చిన ఎద్దు తన కొమ్ములతో కుమ్మడంతో ఒక్కసారిగా గాల్లో 5 అడుగుల ఎత్తుకు ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మోతీలాల్ తలకు గాయం కావడంతో ఆయన స్పాట్‌లోనే మరణించారు. ఈ దాడి వీడియో SMలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్