మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కారణంగా అనేక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీబీఐ విచారణ, ఔషధ భద్రతా విధానాలలో వ్యవస్థాగత సంస్కరణలను కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టపరమైన యంత్రాంగం ఉన్నందున సీబీఐ అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుశార్ మెహతా తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను తోసిపుచ్చింది.