ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యమైన పానీయాల్లో కాఫీ మొదటి స్థానంలో ఉంది. అయితే చక్కెర లేకుండా తాగే బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి సేవిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు తెలిపారు. కాఫీ, నిమ్మరసంలో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు, జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తి పెంపుకు సహకరిస్తుంది. అసిడిటీ ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.