ఇవాళ రాత్రి ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. చంద్రగ్రహణం మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని చూడొచ్చని, బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా చూడొచ్చని పేర్కొన్నారు. ఇవాళ రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుండగా.. 11 గంటల నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది.