మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ లో క్రెటా కారు బీభత్సం సృష్టించింది. ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. దీంతో రోడ్డుపై వెళ్తున్న బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ఓ ఇంటి ప్రహారీ గోడను ఢీకొట్టి లోపలికి వెళ్లింది. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.