రష్యా కాన్సులేట్‌లోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్ (వీడియో)

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రష్యా కాన్సులేట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం వూల్లాహ్రా ప్రాంతంలోని రష్యన్ కాన్సులేట్ గేట్లలోకి ఒక కారు దూసుకెళ్లింది. రష్యా జెండా పక్కన సిల్వర్ SUV కారు తలుపులు తెరిచి వదిలిపెట్టినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలో 39 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి సుర్రీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్