యూపీలోని ముజఫర్ నగర్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.