యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా మంది అనుకుంటారు. వంటల్లోనే కాకుండా రోజూ యాలకులు తినడం వల్ల మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యాలకులను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నీటిలో యాలకులను మరిగించి తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకుల సువాసన కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.