అమిత్‌ షాపై తీవ్ర వ్యాఖ్యలు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు

బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమయ్యారని, 'అమిత్‌షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారంలో మహువాపై కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌ పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్