ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై కేంద్రం కీలక సమావేశం

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలుపై సన్నాహాలను వేగవంతం చేసింది. మే 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో రక్షణ, రైల్వే శాఖల ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనుంది. జీతాలు, పెన్షన్లు, భత్యాలు, సేవా నిబంధనలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు, భవిష్యత్ వేతన నిర్మాణంపై కేంద్రం అభిప్రాయాలను సేకరించనుంది. జీతాల పెంపు, డీఏ విలీనం, కొత్త అలవెన్సులు, పెన్షన్ సవరణలు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్రం జీతాలు, పెన్షన్‌లు పెంచుతుందో లేదో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్