AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. పోస్టాఫీసు రోడ్డులో ఉదయం వాకింగ్ చేస్తున్న మహిళ మనోహర దేవి మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.