యూపీలోని ఘజియాబాద్ ఇందిరాపురంలో తాజాగా ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఇంటి బయట ఉన్న ఓ మహిళ వద్దకు బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. తేరుకునేలోపే రెప్పపాటులో ఆ మహిళ మెడలోని గోల్డ్ చైన్ తెంచుకుని పరారయ్యారు. ఈ హఠాత్పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.