దర్శకుడు చందూ మొండేటి వాయుపుత్ర పేరుతో మైథాలజీ నేపథ్యంలోని 3D యానిమేషన్ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. “మన చరిత్ర ఆత్మలోంచి, మన ఇతిహాసాల పుటల నుంచి పుట్టిన ఒక అమర పురాణగాథ” అంటూ చిత్రబృందం వివరించింది.