TG: పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి కోరారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తేమ శాతం 20 శాతం వరకు ఉన్నాపత్తి పంట సీసీఐ కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 'కపాస్ కిసాన్' యాప్‌పై అవగాహన లేకపోవడం వల్ల కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన ఎత్తి వేసి పాత పద్ధతిలో కొనుగోళ్లు చేయాలన్నారు.