హెచ్‌-1బీ వీసా ‘లాటరీ’ విధానంలో మార్పులు!

అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, లాటరీ విధానంలో మార్పు చేసి.. అధిక నైపుణ్యం, ఎక్కువ వేతనమున్న నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వేతన స్థాయిని ఆధారంగా రిజిస్ట్రేషన్లను వర్గీకరించటం, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోనున్నారని సమాచారం. 2026–2029 వరకు వీసా వేతనాల మొత్తం 502 మిలియన్‌ డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్ల వరకు పెరుగుతుందని DHS అంచనా వేస్తుంది.

సంబంధిత పోస్ట్